పౌర‌స‌త్వ బిల్లు: అస్సోం ప్రజలకు ప్రధాని మోదీ హామీ 

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 07:39 AM IST
పౌర‌స‌త్వ బిల్లు: అస్సోం ప్రజలకు ప్రధాని మోదీ హామీ 

Updated On : December 12, 2019 / 7:39 AM IST

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నక్రమంలో అస్సోం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సోం ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని.. అసోం వాసుల హక్కులు, ప్రత్యేక గుర్తింపు, వారి సంస్కృతికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. 

అస్సోం సంస్కృతి, గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని దానికి ఎటువంటి ముప్పు వాటిల్లదని హామీ ఇస్తున్నానని తెలిపారు. అసోం ప్రజల భాషా, సాంస్కృతికత, వారి భూములకు సంబంధించిన హక్కులు రాజ్యాంగబద్దంగా పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ హామీ ఇచ్చారు. అసోం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు హామీ ఇస్తున్నా.. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

మీ హ‌క్కుల‌ను, విశిష్ట గుర్తింపును, మీ అద్భుత సంస్కృతిని ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని హామీ ఇస్తున్న‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. అస్సాం సంస్కృతీ, సాంప్ర‌దాయాలు క‌ల‌కాలం వ‌ర్థిల్లుతాయ‌ని హామీతో కూడిన దీవెలు ఇచ్చారు. రాజ్యాంగంలోని క్లాజ్ 6 ప్ర‌కారం అస్సాం ప్ర‌జ‌ల రాజ‌కీయ‌, భాష‌, సాంస్కృతిక‌, భూమి హ‌క్కుల‌ను సంర‌క్షించేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.