సార్వత్రిక ఎన్నికలవేళ కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో అయితే ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇటీవలికాలంలో కాంగ్రెస్ నేతలు ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లుగా కాంగ్రెస్ ప్రకటించగంతో వారిని ఎద్దావా చేస్తూ వ్యాఖ్యలు చేశారు మోడీ.
కాంగ్రెస్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ‘వీడియోగేమ్’లో అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. “కాంగ్రెస్ తమ ప్రభుత్వంలో 6 సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లు లెక్కలు చెబుతోందని, అంతకు నాలుగు నెలల ముందు 3సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేశామని చెప్పిందని, ఎన్నికలు అయిపోగానే ఈ సంఖ్య 600కు పోవచ్చునని” మోడీ అన్నారు.
రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మోడీ.. కాంగ్రెస్ నోరు తెరిస్తే అబద్దాలే చెబుతుందని, యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ కాగితాల్లో మాత్రమే కనబడుతాయని, రియల్‌గా జరగవని అన్నారు. కాంగ్రెస్ ముందేమో సర్జికల్ స్ట్రైక్స్‌ను ఖండించిందిని, తరువాతేమో వ్యతిరేకించిందని, ఇప్పుడేమో ‘మీటూ’ అంటుదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదం ఎదుర్కోలేక ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా 2009, 2014లో వేరేదేశంలో పెట్టిందంటూ ఆరోపించారు. 2008లో యూపీ, గుజరాత్, ముంబై, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ఎటువంటి బదులు ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని ప్రధాని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై చర్చ జరిగందని మోడీ అన్నారు.