40 లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపామని ప్రధాని మోడీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ విశేషం అన్నారు.
40 లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపామని ప్రధాని మోడీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ విశేషం అన్నారు. ఆదివారం (డిసెంబర్ 22, 2019) ఢిల్లీ లోని రామ్ లీలా మైదాన్ లో బీజేపీ కృతజ్ఞత సభలో ప్రధాని మాట్లాడుతూ ప్రతిపక్షాలకు పేదల అభివృద్ధి అవసరం లేదు..రాజకీయాలు కావాలన్నారు. అనధికార కాలనీల్లోని 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించామని తెలిపారు. మీ భూమిపై సంపూర్ణ హక్కు కల్పించామని తెలిపారు.
ఢిల్లీ సర్కార్ ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చని హామీలు నేరవేరుస్తామని చెప్పారు. తమకు పేద ప్రజలే వీఐపీలు అన్నారు. తమ గత ఐదేళ్లపాలనో పేదలకు ఇల్లు నిర్మించామని తెలిపారు. ఢిల్లీ సర్కార్ ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చిందని చెప్పారు.
పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని సైత గౌరవించడం లేదన్నారు. ఢిల్లీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. పౌరసత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. తాము దేశం కోసం పని చేస్తామని…మతం కోసం కాదన్నారు.