PM Modi: ఏడాదిన్నరలో 10లక్షల మందికి ఉద్యోగాలివ్వాలి – మోదీ

రాబోయే ఏడాదిన్నర కాలంలో 10లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ప్రభుత్వంలోని పలు శాఖల్ల్లో, మంత్రిత్వ శాఖల్లో రిక్రూట్ చేయాలని ఆదేశించారు.

PM Modi: ఏడాదిన్నరలో 10లక్షల మందికి ఉద్యోగాలివ్వాలి – మోదీ

Modi

Updated On : June 14, 2022 / 10:51 AM IST

 

 

PM Modi: రాబోయే ఏడాదిన్నర కాలంలో 10లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ప్రభుత్వంలోని పలు శాఖల్ల్లో, మంత్రిత్వ శాఖల్లో రిక్రూట్ చేయాలని ఆదేశించారు. మానవ వనరుల శాఖతో అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రి వర్గాలు సమావేశం అనంతరం ప్రధాని మోదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది.

“అన్ని డిపార్ట్‌మెంట్లలో మానవ వనరులపై పీఎం నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో 10లక్షల మంది వరకూ మిషన్ మోడ్ లో నియామకాలు జరగాలి” అని పీఎంఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది.

ప్రతిపక్షాల నుంచి తరచూ విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం త్వరితగతిన నియామకాలు జరపాలని నిర్ణయించిందుకుంది. ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉన్న ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని నిర్ణయించుకుంది.
ఏప్రిల్ నెలలో మోదీ… ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను పరిశీలించాలని టాప్ బ్యూరోక్రాట్లతో చెప్పారు. తద్వారా వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేయొచ్చని సూచించారు. ఫిబ్రవరిలో ప్రభుత్వం రాజ్యసభ వేదికగా 8.7లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పింది.