PM Modi: యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ: మోదీ

కొన్నేళ్లలో యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. రాజకీయ నేతలు, క్రీడాకారులు, నటులు, సీఈవోలు.. ఇలా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు యోగా చేస్తున్నారు. యోగా వాళ్లకు ఏ విధంగా ఉపయోగపడిందో చెబుతున్నారు.

PM Modi: యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ: మోదీ

Pm Modi

PM Modi: గత కొన్నేళ్లలో యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని అభిప్రాయపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోనున్న సందర్భంగా మోదీ ఈ అంశంపై వరుస ట్వీట్లు చేశారు. అందరూ యోగా చేయాలని సూచించారు. ‘‘కొన్నేళ్లలో యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. రాజకీయ నేతలు, క్రీడాకారులు, నటులు, సీఈవోలు.. ఇలా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు యోగా చేస్తున్నారు. యోగా వాళ్లకు ఏ విధంగా ఉపయోగపడిందో చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. అందరూ యోగా డేను జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి.

Boy Suicide: తల్లి పుట్టిన రోజున విష్ చేయనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి’’ అని మోదీ తన ట్వీట్లలో పేర్కొన్నారు. 21న జరిగే యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొనబోతున్నారు. మైసూరులో ఆయన యోగా డే వేడుకల్లో పాల్గొంటారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా మైసూరు ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ఈ వేడుకల్లో దాదాపు 15,000 మంది పాల్గొనబోతున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న 75 చారిత్రక ప్రదేశాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా యోగా డేను సెలబ్రేట్ చేయనున్నారు.