Boy Suicide: తల్లి పుట్టిన రోజున విష్ చేయనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

శనివారం తన తల్లి పుట్టిన రోజు ఉండటంతో తనకు విషెస్ చెప్పాలని భావించాడు. తన తల్లితో ఫోన్‌లో మాట్లాడి విషెస్ చెప్పాలని, దీనికోసం తనకు ఫోన్ ఇవ్వాలని పూవరాజ్.. హాస్టల్ వార్డెన్‌ను అడిగాడు. అయితే, దీనికి వార్డెన్ నిరాకరించాడు.

Boy Suicide: తల్లి పుట్టిన రోజున విష్ చేయనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

Boy Suicide

Boy Suicide: తల్లి పుట్టిన రోజున బర్డ్ డే విషెస్ చెప్పేందుకు హాస్టల్ వార్డెన్ అనుమతివ్వలేదని బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో ఆదివారం జరిగింది. హోసకోటె జిల్లాకు చెందిన పూవరాజ్ అనే పద్నాలుగేళ్ల బాలుడు హాస్టళ్లో ఉండి చదువుకుంటున్నాడు. శనివారం తన తల్లి పుట్టిన రోజు ఉండటంతో తనకు విషెస్ చెప్పాలని భావించాడు. తన తల్లితో ఫోన్‌లో మాట్లాడి విషెస్ చెప్పాలని, దీనికోసం తనకు ఫోన్ ఇవ్వాలని పూవరాజ్.. హాస్టల్ వార్డెన్‌ను అడిగాడు. అయితే, దీనికి వార్డెన్ నిరాకరించాడు. పూవరాజ్ ఎన్నిసార్లు బతిమాలినా వార్డెన్ ఫోన్ ఇవ్వలేదు. మరోవైపు ఊళ్లో ఉన్న బాలుడి కుటుంబం కూడా అదేరోజు హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ చేసింది.

CM KCR: జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో సీఎం కేసీఆర్

తన కొడుకుతో మాట్లాడాలని తల్లి భావించింది. అయితే, ఈ కాల్స్‌కు కూడా వార్డెన్ స్పందించలేదు. దీంతో తల్లి పుట్టిన రోజున బాలుడికి విష్ చేయడం కుదరలేదు. దీంతో బాధపడ్డ పూవరాజ్ శనివారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు బాలుడి మృతదేహాన్ని తోటి విద్యార్థులు గమనించి, హాస్టల్ సిబ్బందికి చెప్పారు. వెంటనే హాస్టల్ యాజమాన్యం పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించింది. హాస్టల్‌కు చేరుకున్న బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.