CM KCR: జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో సీఎం కేసీఆర్

జూన్ 19న జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీకి సంబంధించిన కార్యవర్గం, అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతోపాటు రాష్ట్రాల ప్రతినిధులను కూడా ముందుగా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

CM KCR: జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ పార్టీ ఏర్పాట్లను వేగవంతం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఈ నెల మూడో వారంలో ప్రకటన చేయనున్నారు. జూన్ 19న జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీకి సంబంధించిన కార్యవర్గం, అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతోపాటు రాష్ట్రాల ప్రతినిధులను కూడా ముందుగా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

National Herald case: నేడు ఈడీ ముందుకు రాహుల్.. కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత ఢిల్లీలో ముగ్గురు లేదా నలుగురు అధికార ప్రతినిధులను నియమించనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు కేంద్ర సర్వీసు అధికారులు, కొంత మంది నేతల పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతుండటంతో పలు రాష్ట్రాలకు చెందిన నేతలు ఆయనను ఫోన్‌లో సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటు, జాతీయ కార్యవర్గం వంటి అంశాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో కూడా చర్చలు జరుపుతున్నారు.