ఫేస్‌బుక్‌లో మోడీనే టాప్.. తర్వాతే ట్రంప్

  • Publish Date - April 28, 2020 / 06:10 AM IST

ఇటీవల చేసిన స్టడీ ఆధారంగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీనే ఫేస్‌బుక్‌లో టాప్ లీడర్‌గా నిలిచారు. పీఎం మోడీ పర్సనల్ పేజి మీద 45 మిలియన్ లైకులు ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ఇందులో సగం వెనుకబడి ఉన్నారు. కేవలం 27 మిలియన్ లైకులతో  సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఇక మూడో స్థానాన్ని జోర్డాన్ రాణి 16.8మిలియన్ లైకులతో దక్కించుకున్నారు. వరల్డ్ లీడర్స్ ఆన్ ఫేస్‌బుక్ ర్యాంకింగులను గ్లోబల్ కమ్యూనికేషన్ ఏజెన్సీ నిర్వహించింది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో పర్యటించిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి టాప్ 1కి చేరుతుందని భావించారు. ‘చాలా గౌరవంగా ఉందంటూ మార్క్ జూకర్‌బర్గ్ ఇటీవల సరదాగా కామెంట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్.. ఫేస్‌బుక్ లో నెంబర్ 1.. భారత ప్రధాని మోడీ నెంబర్ 2’ ఎందుకంటే నేను రెండు వారాల్లో ఇండియాకు వెళ్తున్నా అంటూ ట్రంప్ చేసినట్లుగా కామెంట్ చేశారు. 

 

కానీ, ఇంటరేక్షన్స్ లో మాత్రం ట్రంప్ టాప్ స్థానంలోనే ఉన్నారు. ఆయన 12 నెలలుగా పెట్టిన పోస్టులకు 309 మిలియన్ కామెంట్లు, లైకులు, షేర్లు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కువ ఇంటరేక్షన్స్ సంపాదించుకుంది బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బొల్సనారో(205 మిలియన్ ఇంటరేక్షన్స్)

ప్రధాని మోడీ ఇందులో మాత్రం మూడో స్థానంలో ఉన్నారు. కానీ, పీఎం మోడీ పోస్టు షేర్ చేసినంతగా ప్రపంచంలో ఏ నాయకుడి పోస్టు ఎక్కువగా షేర్ కావడం లేదు. మోడీ.. నవరాత్రి పండుగ సందర్భంగా జగదాంబ దేవీని పూజిస్తూ నిమిషం పాటు పెట్టిన వీడియోకు 2కోట్ల 11లక్షల 22వేల వ్యూస్ రాగా, 16లక్షల 94వేల 245కామెంట్లు, లైకులు, షేర్లు వచ్చాయి.