వారణాశి నుంచే మరోసారి బరిలో మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి వారణాశి నుంచే లోక్ సభ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అయ్యారు.గురువారం 184 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో వారణాశి నుంచి బీజేపీ అభ్యర్థిగా మోడీ పేరు ప్రకటించారు. కొన్ని రోజులుగా ఒడిషాలోని పూరీ నియోజకవర్గం నుంచి మోడీ బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అయితే తనకు గత ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చిన వారణాశి నుంచే మరోసారి బరిలోకి దిగాలని మోడీ డిసైడ్ అయ్యారు.