PM Modi : కేంద్ర కేబినెట్ విస్తరణ, పలువురికి ఉద్వాసన

కేంద్ర కేబినెట్ విస్తరణ కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021, జూలై 07వ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భనన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో...పలువురికి ఉద్వాసన పలుకుతున్నారు.

Modi Cabinet (1)

Union Cabinet Expansion : కేంద్ర కేబినెట్ విస్తరణ కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021, జూలై 07వ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భనన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో…పలువురికి ఉద్వాసన పలుకుతున్నారు. ఇప్పటి వరకు నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. కర్ణాటక గవర్నర్ గా నియమితులైన థావర్ చంద్ గెహలోట్ రాజీనామా చేయగా…తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ పోఖ్రియాల్ కు ఉద్వాసన పలికారు. 72 ఏళ్ల వయసు కారణంగా సంతోష్ కుమార్ గంగ్వార్ రాజీనామా చేశారు. కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ కూడా రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
Read More : CM Jagan : ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభం, సీఎం జగన్

మరోవైపు..కొత్త మంత్రుల జాబితాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖరారు చేశారు. ప్రధాన మంత్రి నివాసానికి 19 మంది ఎంపీలు చేరుకున్నారు. కొత్తగా మోదీ మంత్రివర్గంలో 18 మందికి ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం. కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ లకు పదోన్నతి దక్కనుంది. మోదీ కేబినెట్ లో ఓబీసీలకు పెద్దపీఠ వేయనున్నారు. కొత్త కేబినెట్ లో ఎస్సీల నుంచి 12 మందికి అవకాశం కల్పించనున్నారని సమాచారం. ఎస్టీల నుంచి 8 మంది, ఓబీసీల నుంచి 27 మందికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఐదుగురు మైనార్టీలకు ఛాన్స్ ఇస్తారని సమాచారం.

Read More : Robbery In Hyderabad : వీడు మామూలోడు కాదు….రిటైర్డ్ డీజీపీ ఇంట్లోనే చోరీ చేశాడు