CM Jagan : ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభం, సీఎం జగన్

విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దానిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

CM Jagan : ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభం, సీఎం జగన్

Cm Jagan

CM Jagan : విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దానిపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్.. ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్ పై టీచర్లకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, పలువురు విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. నాడు నేడు, జగనన్న విద్యా కానుకపైనా సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

* విద్యారంగంలో నాడు-నేడు, విద్యా కానుకపై సీఎం జగన్‌ సమీక్ష
* నూతన విద్యావిధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
* విద్యార్థులకు నాణ్యమైన విద్య
* విద్యావంతులైన, నైపుణ్యం ఉన్న టీచర్లతో బోధన
* మెరుగైన మౌలిక సదుపాయాలు
* విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లు..
* ఈ లక్ష్యాల కోసమే నూతన విద్యా విధానం
* ఒక్క స్కూలునూ మూసేయకూడదు, ఒక్క టీచర్‌నూ తొలగించకూడదు
* ప్రతి స్కూలు నడవాలి
* నూతన విద్యా విధానం ప్రతిపాదనలను ఈ వారంలో ఖరారు చేయాలి
* నాడు-నేడు పనులను యధావిధిగా కొనసాగించాలి
* షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి కావాలి

కీలక నిర్ణయాలు:
* ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించాలని సూత్రప్రాయ నిర్ణయం
* ఈలోగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు కార్యాచరణ
* అదే నెలలో విద్యాకానుక, నాడు-నేడు రెండో విడత పనులు ప్రారంభం
* దీంతోపాటు మొదటి విడతలో నాడు*నేడు కింద పనులు పూర్తి చేసుకున్న పాఠశాలలను ప్రజలకు అంకింతం చేయనున్న సీఎం

* ఇంటర్‌ ఫైనలియర్‌ మార్కుల అసెస్‌మెంట్‌ ఖరారు
* టెన్త్‌లో టాప్‌ 3 సబ్జెక్టులకు వచ్చిన మార్కుల ఆధారంగా 30శాతం మార్కులు
* ఇంటర్ ఫస్టియర్ లో సబ్జెక్టు వైజ్‌ మార్కులకు 70శాతం మార్కులు
* ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తైనందున వాటి ఫలితాల ఆధారంగా మార్కులు