×
Ad

Lord Rama Statue: ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. ఎత్తు ఎంత అంటే..

మఠం 550వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 27 నుండి డిసెంబర్ 7 వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Lord Rama Statue: గోవాలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సౌత్‌ గోవా కానాకోనలోని గోకర్ణ జీవోత్తం మఠంలో 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ అద్భుత శిల్పాన్ని ప్రఖ్యాత భారతీయ శిల్పి రామ్ సుతార్ తయారు చేశారు. గుజరాత్‌లో కొలువుదీరిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని డిజైన్ చేసింది కూడా రామ్ సుతారే.

శ్రీ సంస్థాన్‌ గోకర్ణ పర్తగాలీ జీవోత్తమ్‌ మఠం 550 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు, సీఎం ప్రమోద్‌ సావంత్‌, పలువురు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మఠాన్ని సందర్శించిన ప్రధాని మోదీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

శ్రీ సంస్థాన్‌ గోకర్ణ పర్తగాలీ జీవోత్తమ్‌ మఠం 550 ఏళ్ల క్రితం స్థాపించబడింది. ఈ మఠం దేశంలోనే అతి పురాతన ఆధ్యాత్మిక సంస్థల్లో ఒకటి. ఈ మఠం గౌడ సరస్వత్ బ్రాహ్మణ సమాజానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది ద్వైత వేదాంత సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. ఆధ్యాత్మిక, విద్య, ఆరోగ్య సామాజిక సేవలకు ఈ మఠం ఎంతో దోహదపడింది. ఈ మఠం మత సామరస్యానికి సాంస్కృతిక గుర్తింపునకు చిహ్నంగా నిలిచింది. మఠం 550వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 27 నుండి డిసెంబర్ 7 వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోవాలోని మఠం ప్రాంగణాన్ని 370 సంవత్సరాల క్రితం కనకోనా (దక్షిణ గోవా జిల్లా)లోని పార్టగల్ గ్రామంలో నిర్మించారు.

Also Read: విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇకపై అందుకు అనుమతి..