PM Modi: ‘గర్బా’పై తాను రాసిన పాటను ట్విటర్‌లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. నెట్టింట వీడియో వైరల్

దసరా శరన్నవరాతుల సందర్భంగా దుర్గామాతను కీర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘గర్భా’ పాటను రాశారు. ఈ పాటను గాయని ..

PM Modi: ‘గర్బా’పై తాను రాసిన పాటను ట్విటర్‌లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. నెట్టింట వీడియో వైరల్

PM Modi Garba Song

Updated On : October 7, 2024 / 12:30 PM IST

PM Modi Garba Song: దసరా శరన్నవరాతుల సందర్భంగా దుర్గామాతను కీర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘గర్భా’ పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి ఆలపించారు. కాగా.. పాటకు సంబంధించిన వీడియోను సోమవారం ఉదయం ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. నేను రచించిన పాటను గాయని పూర్వా మంత్రి తన అధ్బుతమైన స్వరంతో ఆలపించారని ప్రధాని ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. చాలా అద్భుతమైన రీతిలో గాయని తాను రాసిన గీతాన్ని పాడినట్లు మోదీ ప్రశంసించారు.

Also Read: Gold and silver Price: పండుగల వేళ మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

గతేడాది కూడా ప్రధాని శరన్నవరాత్రుల వేళ ప్రత్యేకమైన కవితను రాశారు. అది మ్యూజిక్ వీడియో రూపంలో అప్పుడు విడుదలైంది. తాజాగా గర్బాపై పాటను రాశారు. ఆ పాటను గాయని పూర్వా మంత్రి పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ  తన అధికారి ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా పాటపై స్పందిస్తూ.. ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ ‘అవటికలయ’ అనే గర్భా పాటను నేను రచించానని మోదీ చెప్పారు. దుర్గాదేవి ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని మోదీ కోరుకున్నారు.