PM Modi: ప్రపంచ నేతల కంటే.. టాప్‌లోనే మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అప్రూవల్ జాబితాలో ప్రపంచ నాయకుల కంటే ఇంకా టాప్ లోనే ఉన్నారట. అమెరికాకు చెందిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ మార్నింగ్ కన్సల్ట్...

PM Modi: ప్రపంచ నేతల కంటే.. టాప్‌లోనే మోదీ

Pm Modi (1)

Updated On : September 5, 2021 / 12:48 PM IST

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ అప్రూవల్ జాబితాలో ప్రపంచ నాయకుల కంటే టాప్ లోనే ఉన్నారు. అమెరికాకు చెందిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ మార్నింగ్ కన్సల్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. వారాంతపు డేటా ఆధారంగా వివరాలు వెల్లడించే ఈ సర్వేలో మోడీ 70శాతం అప్రూవల్ దక్కించుకున్నారు.

మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రూస్ మాన్యుయేల్ లోపెచ్ ఒబ్రాడర్, ఇటాలియన్ పీఎం మారియో ద్రఘీ, జర్మన్ ఛాన్సిలర్ ఏంజిల్ మెర్కెల్, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో, యూకే పీఎం బోరిస్ జాన్సన్, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనరోల డేటాను కూడా పరిశీలించారు.

మార్నింగ్ కన్సల్ట్ ప్రొప్రైటరీ ప్లాట్‌ఫాం పొలిటికల్ ఇంటిలిజెన్స్ బేస్‌డ్ గా వ్యవహరిస్తుంది. ఎన్నికలపై రియల్ టైం పోలింగ్ డేటాను, ఓటింగ్ ఇష్యూలు, ఎలక్టెడ్ అఫీషియల్స్ లాంటి విషయాలు బయటపెడుతుంది. అమెరికా వ్యాప్తంగా రిజిష్టర్‌డ్ ఓటర్లతో 5వేల మంది డైలీ ఇంటర్వ్యూలు, గ్లోబల్ లీడర్ షిప్ గురించి 11వేల మంది డైలీ ఇంటర్వ్యూలు నిర్వహించారు.

సర్వేలో వయస్సు, జెండర్, ప్రాంతం, విద్యార్థత వంటివి పరిగణనలోకి తీసుకుంటూనే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. యునైటెడ్ స్టేట్స్ లో వివక్ష, సంప్రదాయం లాంటి అంశాలతో విడదీస్తూ నిర్వహిస్తారు. ప్రతి దేశంలో ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేషన్ కంపెనీలు లోకల్ లాంగ్వేజిలో ట్రాన్స్‌లేషన్ చేయిస్తుంటాయి.