గత మూడు సంవత్సరాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ ప్రయాణాల కోసం ఎంతఖర్చు పెట్టారో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రత్యేక విమానాల కోసం రూ. 255 కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2016-19 సంవత్సరాల మధ్య ప్రధాని చార్టెర్డ్ విమానాల ఖర్చు సుమారు రూ. 255 కోట్లని తెలిపారు. 2019 – 20 ఆర్థిక సంవత్సరానికైనా ఖర్చు అందాల్సిన అవసరం ఉందని సభకు తెలిపారు.
2016 – 18 సంవత్సరాల మధ్య ప్రధాని విదేశీ నేతలతో హాట్ లైన్ సంభాషణల కోసం ఖర్చు సుమారు రూ. 3 కోట్లని తెలిపారు. ప్రభుత్వ విధానం ప్రకారం..దేశం లోపల వైమానిక దళ విమానాలు, హెలికాప్టర్లలో ప్రధాని అధికారికంగా పర్యటిస్తే..ఎలాంటి ఛార్జీలు ఉండవన్నీ అవన్నీ ఉచితమన్నారు. మే 2014 ప్రధానిగా పదవి చేపట్టినప్పటి నుంచి 42 ఫారిన్ ట్రిప్స్ లో 84 దేశాలు తిరిగి వచ్చారు. 2015 – 16 సంవత్సరాల్లో అత్యధికంగా 24 దేశాల్లో పర్యటించారు. ప్రధాని మోడీ దేశంలో కన్నా విదేశాల్లోనే ఎక్కువ కాలం ఉంటున్నారని విపక్షాలు తరచూ విమర్శిస్తుంటాయి. తాజా లెక్కలతో ఎలాంటి వ్యాఖ్యలు వినిపిస్తాయో చూడాలి.
Read More :