Modi’s net worth : మోదీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా ? వ్యక్తిగత వాహనం లేదు

మోదీకి కేవలం నాలుగు గోల్డ్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఎలాంటి వ్యక్తిగత వాహనం లేకపోగా...బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం తీసుకోలేదు.

PM Modi : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ స్వల్పంగా పెరిగాయి. కానీ..ఆయన పేరిట ఎలాంటి వ్యక్తిగత వాహనం లేదు. ఎలాంటి ఆర్థిక సంస్థల నుంచి ఆయన ఎలాంటి రుణం తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయాలన్నీ ప్రధాన మంత్రి వెబ్ సైట్ లో ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం…గత సంవత్సరం రూ. 2.85 కోట్లుగా ఉన్న ప్రధాని నికర సంపద రూ. 22 లక్షలు ఎగబాకి..ఇప్పుడు రూ. 3.07 కోట్లకు చేరింది.

Read More : Corona Epidemic: కొవిడ్‌కు ముందు పరిస్థితులు రావాలంటే.. 8వారాలు కీలకం

ప్రధాని తాజా డిక్లరేషన్ ప్రకారం…మోదీ బ్యాంక్ బ్యాలెన్స్ మార్చి 31వ తేదీ నాటికి రూ. 1.5 లక్షలు, రూ. 36 వేలుగా ఉంది. డిక్లరేషన్ ప్రకారం..మోదీకి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్స్ నుంచి ఎలాంటి సంపద జమ కాలేదు. ఎస్ బీఐ గాంధీనగర్ బ్రాంచ్ లో గత సంవత్సరం రూ. 1.6 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి రూ. 1.86 కోట్లకు ఈ సంపద పెరిగింది. ఈ కారణంగా మోదీ సంపద ఆ మేరకు పైకి ఎగబాకింది. మోదీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో రూ. 8,93,251, ఎల్ ఐసీ పాలసీల్లో  రూ. 1,50,957 ఎల్ అండ్ టీ ఇన్ ఫ్రా బాండ్స్ లో రూ. 20 వేల చొప్పున ఇన్వెస్ట్ చేశారు.

Read More : YouTube : యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నారా..! ఈ షార్ట్‌కట్స్ తెలుసుకోండి

ఇక మోదీకి కేవలం నాలుగు గోల్డ్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఎలాంటి వ్యక్తిగత వాహనం లేకపోగా…బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం తీసుకోలేదు. గుజరాత్ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు రెండు నెలల ముందు..మోదీ గుజరాత్ లో గాంధీనగర్, సెక్టార్ 1లో ముగ్గురు సహ యజమానులతో కలిసి 3543 చ.అడుగుల ప్లాట్ ను కొనుగోలు చేశారు. అప్పట్లో దీని ఖరీదు రూ. 1.3 లక్షలుగా ఉంది. భూమిపై రూ. 2.4 లక్షల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో దీని విలువ..రూ. 1.10 కోట్లు పలుకుతోంది.

ట్రెండింగ్ వార్తలు