Corona Epidemic: కొవిడ్‌కు ముందు పరిస్థితులు రావాలంటే.. 8వారాలు కీలకం

కొవిడ్ మహమ్మారిని పారద్రోలడానికి మరో 6 నుంచి 8 వారాల పాటు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు.

Corona Epidemic: కొవిడ్‌కు ముందు పరిస్థితులు రావాలంటే.. 8వారాలు కీలకం

Coivd Epidemic

Corona Epidemic: కొవిడ్ మహమ్మారిని పారద్రోలడానికి మరో 6 నుంచి 8 వారాల పాటు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తే కొవిడ్ కు ముందు పరిస్థితులను మళ్లీ చూడొచ్చని అన్నారు. మహమ్మారి పూర్తిగా పోయిందనుకోవద్దని రాబోయే పండగల సీజన్‌లో జాగ్రత్తగా వ్యవహరించడం కీలకమని సూచించారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ రోగాన్ని తీవ్రతరం కాకుండా చూస్తుందని, టీకా తీసుకున్నవారికి కొవిడ్‌ సోకినా తేలికపాటి దశకే పరిమితమవుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి తీసుకోనివారికి వైరస్‌ సోకితే ప్రమాదం తీవ్రమయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈమేరకు అంతా తగిన జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో రోజురోజుకీ వైరస్‌ తిరోగమనంలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో క్రమేపీ తగ్గుతున్న కొవిడ్‌ కేసుల సంఖ్య శుక్రవారం 3 లక్షలకు చేరువైంది. రోజువారీ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. 24 గంటల్లో 31వేల 382 మంది కొత్తగా వైరస్‌ బారిన పడగా.. 318 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ఇదిలా ఉంటే మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 35లక్షల 94వేల 803కి చేరగా.. ఇంతవరకూ 4లక్షల 46వేల 368మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి బయటపడిన వారు 3కోట్ల 28లక్షల 48వేల 273 మంది.

 

…………………………: ఒంపు సొంపులతో ముచ్చెమటలు పట్టించే మాళవిక!

ఒక్క రోజులో 32,542 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. క్రియాశీలక కేసుల సంఖ్య 3,00,162 (0.89%)కి తగ్గింది. 188 రోజుల్లో ఇంత తక్కువకు చేరడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా గురువారం 15,65,696 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2% నమోదైంది.