తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. 68ఏళ్లు పూర్తిచేసుకుని 69వ పడిలోకి అడుగుపెట్టిన చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోడీ అంటేనే ఒంటి కాలిపై లేస్తున్న చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంపై అందరూ షాక్‌కు గురయ్యారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని, రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మోడీ ఆకాంక్షించారు. గతంలో కూడా పలుసార్లు చంద్రబాబుకు మోడీ శుభాకాంక్షలు తెలిపినప్పటికీ.. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో శుభాకాంక్షలు చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. మోడీ మళ్లీ ప్రధాని కాకూడదంటూ.. చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టి జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2017లో ఇండస్ట్రీయస్ సీఎం అంటూ పొగుడుతూ ట్వీట్ చేసిన మోడీ ఇప్పుడు అటువంటి పొగడ్తలు ఏమీ లేకుండా ట్వీట్ చేశారు.
Greetings to Andhra Pradesh CM, @ncbn Garu on his birthday. Praying for his long and healthy life.
— Chowkidar Narendra Modi (@narendramodi) 20 April 2019
Wishing the industrious CM of AP, @ncbn Garu a very happy birthday. May he lead a long life filled with best health.
— Chowkidar Narendra Modi (@narendramodi) 20 April 2017