వారణాశిలో ఏప్రిల్-26న మోడీ నామినేషన్

ఏప్రిల్-26,2019న ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేయనున్నారు.

ఏప్రిల్-26,2019న ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేయనున్నారు.

ఏప్రిల్-26,2019న ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ముందు రోజు ఏప్రిల్ 25న వారణాశిలో నిర్వహించే మెగా రోడ్ షోలో మోడీ పాల్గొంటారు.ఈ రోడ్ షోలో బీజేపీ అగ్రనాయకులు కూడా పాల్గొంటారు.ఏడో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో భాగంగా మే-19,2019న వారణాశి లోక్ సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.మే-23న సార్వత్రిక,నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

2014సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోడీ గుజరాత్ లోని వడోదర,యూపీలోని వారణాశి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.ఆ తర్వాత వడోదర సీటు వదులుకున్నారు.ఈ ఎన్నికల్లో వారణాశి, పూరి నుంచి మోడీ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.అయితే మోడీ వారణాశి నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారని బీజేపీ lనాయకత్వం సృష్టం చేసింది.
Read Also : మాయ చేయొద్దు : మోడీ మూవీకి ఈసీ బ్రేక్