PM Modi : బిర్సా ముండా జన్మస్థలాన్ని దర్శించటం నా అదృష్టంగా భావిస్తున్నా : జార్ఖండ్ పర్యటనలో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం జార్ఖండ్ చేరుకున్నారు. రాంచిలోని బిర్సా ముండా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం హేమంత్ సోరెన్ స్వాగతం పలికారు. ప్రజలు సైతం పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.

PM narendra Modi Jharkhand Tour

PM Modi Jharkhand Tour : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం జార్ఖండ్ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రానికి రాంచిలోని బిర్సా ముండా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం హేమంత్ సోరెన్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌ వరకు మోదీ రోడ్‌ షో నిర్వహించారు. ప్రధానిని చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపారు. ప్రధానిపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ప్రధాని కూడా వారిని ఏమాత్రం నిరాశపరచలేదు. అందరికి అభివాదాలు చేసుకుంటు ముందుకు కదిలారు. తన రాక కోసం ఎంతో ఆదరంగా ఎదురుచూసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల బిజీ బిజీ షెడ్యూల్ లో కూడా ప్రధాని మోదీ బుధవారం జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భావం రోజున ఆ రాష్ట్ర ప్రజలను కలిసేందుకు ఇదో సందర్భంగా చేసుకున్నారు.  జార్ఖండ్ పర్యటనలో మోదీ బిర్సా ముండా జన్మస్థలాన్ని సందర్శించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. బుధవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమే కాకుండా బిర్సా ముండా జయంతి రోజు కూడా. దీంతో ప్రధాని రాష్ట్రంలో బలహీన గిరిజన వర్గాల సంక్షేమం కోసం రూ.24,000 కోట్ల విలువైన పథకాన్ని ప్రారంభించటమే కాకుండా బిర్సాముండాకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు.

అలాగే ట్విట్టర్ వేదికంగా ప్రధాని బిర్సాముండా జయంత్రి సందర్భంగా బలహీన గిరిజన వర్గాల సంక్షేమం కోసం రూ.24,000 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించటం..జన జాతీయ గౌరవ్ దివస్ గా కూడా జరుపుకుంటారు అంటూ పేర్కొన్నారు. బిర్సాముండా జన్మస్థలమైన ఉలిహతును సందర్శించటం తకు దక్కిన అదృష్టంగా..గర్వంగా భావిస్తున్నానన్నారు. నవంబర్ 15, చాలా ప్రత్యేకమైన రోజు. లార్డ్ బిర్సా ముండా జీ జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకునే గిరిజన అహంకార దినోత్సవంలో జార్ఖండ్ ప్రజలతో కలిసి పాల్గొనే అవకాశం తనకు దక్కింది అంటూ పేర్కొన్నారు. జార్ఖండ్ ప్రజలంతా తన కుటుంబ సభ్యులేనని దేశ పురోగతికి గణనీయమైన కృషి చేశారు అంటూ ప్రశంసలు కురిపించారు.

బుధవారం ‘ఆదివాసి అహంకార దినోత్సవం’ సందర్భంగా బలహీన గిరిజన సమూహాల (పీవీటీజీ) అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.24,000 కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ‘వికాస్‌ భారత్‌ సంకల్ప యాత్ర’ ప్రారంభించి, ‘పీఎం కిసాన్‌ యోజన’ కింద 15వ విడత రూ.18,000 కోట్లు విడుదల చేయడంతోపాటు రాష్ట్రంలో రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కాగా..భారతదేశ చరిత్రలో బిర్సా ముండా జన్మస్థలాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయే కావటం గమనించాల్సిన విషయం.

ట్రెండింగ్ వార్తలు