New Parliament Inauguration: ప్రపంచానికి భారతదేశ దృఢ సంకల్ప సందేశం ఈ నూతన భవనం ఇస్తుంది

మరో 25 ఏళ్లలో భారత్ 100 ఏళ్ల స్వాతంత్రాన్ని జరుపుకుంటుంది. 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. భారత్‌ను చూసి అనేక దేశాలు ప్రేరణ పొందుతాయి.

PM Modi

PM Narendra Modi: నూతన పార్లమెంట్ భవనం ప్రపంచానికి భారతదేశ దృఢ సంకల్ప సందేశాన్ని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా సాగింది. మోదీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇది కేవలం భవనం కాదు, 140 కోట్ల ప్రజల ఆకాంక్షల, కలల ప్రతిబింబం అని అన్నారు. దేశ వికాస యాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గడియలు వస్తాయి. అమృతోత్సవ వేళ చారిత్రాత్మక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారని అన్నారు. నవ భారత్ కొత్త మార్గాలు నిర్దేశించుకుంటూ ముందకెళ్తోందని ప్రధాని చెప్పారు. ప్రపంచ మొత్తం మన దేశ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోందని అన్నారు.

New Parliament Inauguration: నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో ఏ రాష్ట్రం నుంచి ఏ వస్తువును వినియోగించారో తెలుసా?

ఈ పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం. ఇది అనేక సంస్కృతుల సమ్మేళనం. చారిత్రాత్మక సమయంలో సెంగోల్ ప్రతిష్టాపన జరిగింది. కర్తవ్యం, సేవకు ఇది ప్రతీకగా నిలుస్తుంది. చోళ రాజవంశంలో ‘సెంగోల్’ న్యాయం, ధర్మం సుపరిపాలనకు ప్రతీక. పవిత్ర ‘సెంగోల్’ మర్యాదను గౌరవాన్ని పునరుద్ధరించడం మన అదృష్టం. ఈ సభలో కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడల్లా ‘సెంగోల్’ మనకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న నేల భారత్. ఇక్కడ జరిగే నిర్ణయాలు దేశ ఉజ్వల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వంచిత, పీడిత వర్గాలకు పార్లమెంట్ ద్వారా న్యాయం జరగాలని మోదీ అన్నారు.

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. భవన నిర్మాణ కార్మికులకు సన్మానం

మరో 25 ఏళ్లలో భారత్ 100 ఏళ్ల స్వాతంత్రాన్ని జరుపుకుంటుంది. 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. భారత్‌ను చూసి అనేక దేశాలు ప్రేరణ పొందుతాయి. భారత్‌లో వేగంగా పేదరికం దూరం అవుతుందని ప్రధాని అన్నారు. పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడిలో కర్తవ్య భావాన్ని పెంపొందిస్తుందని, నేషన్ ఫస్ట్ అన్న భావన ఉండాలి. నూతన పార్లమెంట్ దేశానికి నూతన బలాన్ని ఇస్తుంది. వచ్చే 25 ఏళ్ళలో పార్లమెంట్‌లో చేసే చట్టాలు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాయని ప్రధాని అన్నారు. పాత భవనంలో సభ్యుల కార్యకలాపాలకు ఇబ్బందిగా ఉండేది. భవిష్యత్తులో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరిగిందని ప్రధాని అన్నారు. భారత్ వృద్ధి, ప్రపంచ వృద్ధికి ప్రేరణగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు.