PM Narendra Modi
దేశంలో ఎన్డీఏ 272 సీట్ల మెజారిటీని దాటడంతో దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఎన్డీఏపై ప్రజలు వరుసగా మూడోసారి నమ్మకాన్ని ఉంచారని అన్నారు. భారత చరిత్రలో ఇదో చరిత్రాత్మక అడుగు అని తెలిపారు. ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు.
గత దశాబ్దం కాలంగా చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తామని, ప్రజల కలలను సాకారం చేయడానికి కృషిచేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. గెలుపుకోసం కృషి చేసిన తమ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. మాటల్లో చెప్పలేనంత కృషి చేశారని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల ప్రజల్లో ఉన్న అచంచల విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పడుతున్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ విజన్‌పై ప్రజల్లో విశ్వాసం ఉందని తెలిపారు. దేశాభివృద్ధి ప్రయాణానికి మరింత బలాన్ని అందించడానికి నవ భారత్ సిద్ధంగా ఉందన్నారు.
ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో మోదీ కామెంట్స్
Also Read: ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా