Donald Trump : డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..

కాల్పుల్లో ఘటనపై ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ స్పందించారు. కాల్పుల శబ్దం వినగానే వెంటనే ఏదో జరుగుతుందని నాకు అర్ధమైంది.

PM modi

PM Modi : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న సమయంలో దుండగులు ఒక్కసారిగా ట్రంప్ పై కాల్పులు జరిపారు. ట్రంప్ చెవికి బుల్లెట్ తగలడంతో తీవ్ర గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్ చుట్టూ రక్షణగా చేరి భద్రత కల్పించారు. ఈ కాల్పుల్లో ట్రంప్ గన్ మెన్ సహా, ఎన్నికల సభలో పాల్గొన్న పౌరుడు మరణించాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అయితే, ట్రంప్ చెవికి గాయమై రక్తస్రావం కావడంతో భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ట్రప్ డిశ్చార్జ్ అయ్యాడు.

Also Read : Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో వైరల్

కాల్పుల్లో ఘటనపై ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ స్పందించారు. కాల్పుల శబ్దం వినగానే వెంటనే ఏదో జరుగుతుందని నాకు అర్ధమైంది. అంతలోనే బుల్లెట్ నా కుడి చెవి పైభాగంలో నుంచి వెళ్లినట్లు అనిపించింది. చాలా రక్తస్రావం జరిగింది. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తన ప్రాణాలను కాపాడారు. వారికి ధన్యవాదాలు అంటూ ట్రంప్ పేర్కొన్నాడు. ఇలాంటి చర్య అమెరికాలో జరగడం నమ్మశక్యంగా లేదు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ప్రస్తుతానికి ఏమీ తెలియదని ట్రంప్ తెలిపారు.

Also Read : WCL 2024 Final : పాకిస్థాన్ పై ఇండియా ఛాంపియన్స్ ఘన విజయం.. బౌండరీల మోత మోగించిన తెలుగు తేజం

ట్రంప్ పై కాల్పుల ఘటనను భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు తావులేదు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా అంటూ మోదీ పేర్కొన్నారు.