President’s Rule : పంజాబ్ లో రాష్ట్రపతి పాలన!

బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

Manohar Lal Khattar : బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ పెద్ద,కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించిన మురుసటి రోజే హర్యానా సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

చరణ్ జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలనలోనే…మరికొన్ని వారాల్లో జరగాల్సిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ లో శాంతి భద్రతలను కాంగ్రెస్ కాపాడలేదని,ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యమే దీనికి ఆధారమని ఖట్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం ఖట్టర్..శుక్రవారం హర్యానా హోంమంత్రి అనిల్ విజ్,హర్యానా బీజేపీ చీఫ్ ఓపీ ధనకర్ తో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఓ మొమోరాండం సమర్పించారు.

పంజాబ్ ప్రభుత్వంపై రాష్ట్రపతి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తాము మొమోరాండంని గవర్నర్ కి సమర్పించినట్లు సీఎం ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మరికొన్ని వారాల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు పంజాబ్ వెళ్లి ప్రచారం నిర్వహిస్తారని,మోదీ కూడా మరోసారి పంజాబ్ వెళతారని,అయితే ప్రస్తుత పంజాబ్ ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేట్లు కనిపించడం లేదని ఖట్టర్ అన్నారు.

ప్రపంచంలోని మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని,ప్రధాని పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాలు ఆమోదయోగ్యనీయమైనవి కాదని తెలిపారు. మోదీ కాన్వాయ్ ని అడ్డుకునేందుకు నిరసనకారులు రోడ్డుపైకి వస్తుంటే..ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎందుకు పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని ఖట్టర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందని,కానీ ఆందోళనకారులు రోడ్డుని దిగ్భందించారని అన్నారు. దీని గురించి తెలియదు అని పంజాబ్ ప్రభుత్వం చెబుతుంటే నమ్మడం చాలా కష్టమని ఖట్టర్ అన్నారు. పోలీసులు కూడా ఆందోళనకారులను రెచ్చగొట్టినట్లు తనకు తెలిసిందన్నారు. పంజాబ్ లో శాంతి భద్రతలను కాపాడటంలో సీఎం చన్నీ అట్టర్ ఫ్లాఫ్ అయ్యారని ఖట్టర్ తెలిపారు.

ఇక,శుక్రవారం ఉదయం సీఎం ఖట్టర్..ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి పంచకులలోని మాతా మాన్సా దేవి ఆలయంలో మోదీ దీర్ఘాయుష్షు కోసం ఓ యజ్ణం,మహా మృత్యుంజయ కార్యక్రమం నిర్వహించారు.

ALSO READ International Arrivals : కేంద్రం కీలక నిర్ణయం..వారందరికీ 7 రోజుల తప్పనిసరి హోం క్వారంటైన్

ALSO READ PM Modi Convoy : ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం..ఏడాది క్రితమే పక్కా ఫ్లాన్!

ట్రెండింగ్ వార్తలు