CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి .. 13మంది అరెస్ట్

బీహార్ సీఎం నితీశ్ కాన్వాయ్ పై దేశ రాజధాని నగరం అయిన పాట్నాలో రాళ్ల దాడి జరిగింది. ఆఘటనకు సంబంధించి 13 మందిని అరెస్టు చేసినట్లు పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు.

stone-pelting at Bihar CM Nitish Kumar’s convoy : బీహార్ సీఎం నితీశ్ కాన్వాయ్ పై దేశ రాజధాని నగరం అయిన పాట్నాలో రాళ్ల దాడి జరిగింది. ఆఘటనకు సంబంధించి 13 మందిని అరెస్టు చేసినట్లు పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం (ఆగస్టు 21,2022) పాట్నా- గయ మార్గంలో గౌరీచక్‌లోని సోహ్గి గ్రామంలో ఆందోళనకారులు మూకుమ్మడి దాడి చేసి సీఎం కాన్వాయ్ పై రాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో సీఎం కాన్వాయ్ కి చెందిన మూడు, నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా..రాళ్లదాడి జరిగిన సమయంలో సీఎం కాన్వాయ్ లో లేరు. ఆయన భద్రతా సిబ్బంది కాన్వాయి కార్లలో ఉన్నారు.

సోమవారం (22,2022) సీఎం పర్యటన కోసం ఆదివారం సాయంత్రం కాన్వాయ్ ను గయకు తీసుకెళ్తుండగా ఈ దాడి జరిగింది. దీంతో సీఎం నితీస్ హెలికాప్టర్‌లో గయకు చేరుకోవాల్సి ఉంది. ఆయన భద్రతలో భాగమైన వాహనాలు ఒక రోజు ముందుగానే వెళ్లాయి. ఈ ఆటనపై పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ మాట్లాడుతూ..గత రెండు-మూడు రోజులుగా తప్పిపోయిన యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని..దీంతో కొంతమంది తర్వాత కోపోద్రిక్తులైన ఆందోళనలకు పాల్పడుతున్నారని కారులు పాట్నా- గయ రహదారిని దిగ్బంధించారని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఆందోళనకారులు సీఎం కాన్వాయ్ కనిపించడంతో దానిపై రాళ్ల దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 15 మందిపై కేసు నమోదు చేయగా, వారిలో 13 మందిని అరెస్టు చేశామని తెలిపారు. కాగా..సీఎం నితీశ్ కుమార్ సోమవారం (22,2022)గయలో పర్యటించనున్నారు. గయలో నిర్మిస్తున్న రబ్బరు డ్యామ్‌ను పరిశీలించి..జిల్లాలో కరవు పరిస్థితులపై జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

 

ట్రెండింగ్ వార్తలు