Ghaziabad Court: ఘజియాబాద్ కోర్టులో ఉద్రిక్తత.. లాయర్లను పరుగెత్తించిన పోలీసులు.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీలు, కుర్చీలతో న్యాయవాదులపై దాడి చేశారు.

Ghaziabad court

Ghaziabad District Court: ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీలు, కుర్చీలతో న్యాయవాదులపై దాడి చేశారు. ఈ ఘటనలో కొందరు న్యాయవాదులకు గాయాలయ్యాయి. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన కేసులో కొందరు న్యాయవాదులు జిల్లా జడ్జిని ఆశ్రయించారు. విచారణ సందర్భంగా న్యాయవాదులు జిల్లా జడ్జితో దురుసుగా ప్రవర్తించారు. ఆయన పోడియంను చుట్టుముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో జిల్లా న్యాయమూర్తి కోర్టు ఆవరణం నుంచి న్యాయవాదులను బయటకు పంపించాలని పోలీసులను ఆశించారు. ఈ క్రమంలో న్యాయవాదులను బయటకు పంపించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు.

Also Read: Israel: బాబోయ్.. హెజ్‌బొల్లా సొరంగం చూశారా.. లోపల చిన్నపాటి ఇంటినే నిర్మించారు.. వీడియో వైరల్

కోర్టు గదిలోనే న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పలువురు పోలీసులు కుర్చీలను న్యాయవాదులపైకి విసిరేస్తూ వారిని పరుగెత్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో 20 నుంచి 30 మంది పోలీసులు లాయర్లను లాఠీలతో కొట్టడం కనిపిస్తోంది. ఈ క్రమంలో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. అయినా, కోర్టు ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కోర్టు హాలులోని కుర్చీలను పైకిలేపి లాయర్లను అక్కడి నుంచి తరిమేసినట్లు వీడియోలో చూడొచ్చు. ఈ ఘటనపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసనకు సిద్ధమయ్యారు.