Lockdown Violators : లాక్ డౌన్ వేళ, గులాబీ పువ్వు మీకు..బైక్ మాకు

బెంగళూరు పీణ్యా పోలీసులు బయట తిరిగే వారికి దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. బ్యారికేడ్లు అమర్చడం, తనిఖీలు చేయడంతో పాటు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారి ఎదుట పోలీసులు ప్రత్యక్ష్యమవుతున్నారు. వారికి గులాబీ పువ్వు అందిస్తున్నారు.

Police Gives Red Rose : కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి పలు రాష్ట్రాలు విధిస్తున్న లాక్ డౌన్ ను కొంతమంది పక్కన పెడుతున్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్నారు. వీరికి ఫైన్లు వేస్తున్నారు. కొంతమంది పోలీసులు కొత్త కొత్త శిక్షలు వేస్తున్నారు. వారిలో మార్పు రావాలని ప్రయత్నిస్తున్నారు. వీపులపై లాఠీలు నృత్యం చేస్తున్నాయి. బిస్కీలు తీయించడం, గుంజీలు తీయడం వంటివి చేయిస్తున్నారు.

ఇటీవలే..బెంగళూరు శివారు ప్రాంతానికి చెందిన పోలీసులు..వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారికి పూలు, హారతి, అక్షింతలు వేస్తున్నారు. తాజాగా..బెంగళూరు పీణ్యా పోలీసులు బయట తిరిగే వారికి దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. బ్యారికేడ్లు అమర్చడం, తనిఖీలు చేయడంతో పాటు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారి ఎదుట పోలీసులు ప్రత్యక్ష్యమవుతున్నారు.

వారికి గులాబీ పువ్వు అందించి బైక్ దిగమంటారు. అనంతరం ఆ బైక్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. గులాబీ పువ్వు మీకు..బైక్ మాకు ..అంటూ చెప్పేస్తున్నారు. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉంది. ఈ సమయంలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిత్యావసర సరుకులు, ఇతరత్రా పనులు చేసుకుంటున్నారు.

సమయం అయిపోయినా..రద్దీ తగ్గడం లేదు. ఏదో ఒక కారణాలు చెబుతూ..వెళుతున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 31,515 వాహనాలను జప్తు చేసి రూ.3.50 కోట్లు జరిమానా వసూలు చేశారు.

Read More :Vaccine Supply : అడ్వాన్స్‌ కొట్టు.. ఫైజర్‌ పట్టు!

ట్రెండింగ్ వార్తలు