Police Protect Maoist
Police Protect Maoist – Jharkhand : పోలీసులు, మావోయిస్టుల మధ్య పచ్చగడ్డివేస్తే మండిపోతుంది. అనుకోకుండా పోలీసులు, మావోయిస్టులు ఎదురుపడితే ఎదురుకాల్పులు జరుపుకుంటారు. ఎన్ కౌంటర్ జరిగినప్పుడు పోలీసులు లేదా మావోయిస్టులు చనిపోతుంటారు. మావోయిస్టులను మట్టుపెట్టాలని పోలీసులు, పోలీసులను మట్టుబెట్టాలని మావోయిస్టులు చూస్తుంటారు. అలాంటి పోలీసులు ఓ మావోయిస్టు పట్ల మానవత్వం ప్రదర్శించారు. పట్టుబడిన మావోయిస్టును చంపకుండా ప్రాణ భిక్ష పెట్టారు.
ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడిన మావోయిస్టుకు ప్రాణ దానం చేశారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో గాయడపడిన మావోయిస్టును సహచరులు అక్కడే వదిలి పారి పోయారు. కానీ, పోలీసులు అతన్ని చంపకుండా కాపాడి మానవత్వం చాటుకున్నారు. అడవిదారిలో గాయపడిన మావోయిస్టును 5 కిలోమీటర్లు భూజాలపై మోస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విచిత్ర ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది.
Khammam District : అనారోగ్యంతో చనిపోయిన కుక్కకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్న పోలీసులు
వివరాల్లోకి వెళ్తే.. గత శుక్రవారం జార్ఖండ్ లో పోలీసులు యాంటీ మావోయిస్టు ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి పశ్చిమ జిల్లాలోని హస్సిపీ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డారు. అయితే సహచర మావోయిస్టులు అతన్ని అక్కడే వదిలేసి పారి పోయారు. కాగా, భద్రతా సిబ్బందికి గాయాలతో బాధపడుతున్న మావోయిస్టు కనిపించాడు.
పోలీసులు గాయపడిన మావోయిస్టును భుజాలపైకి ఎత్తుకుని, అడవిలో ఐదు కిలోమీటర్లు నడిచి హాత్తిబురు క్యాంపుకు తీసుకెళ్లారు. అక్కడ క్యాంపు వైద్యులు గాయపడిన మావోయిస్టుకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగుగైన వైద్యం కోసం శనివారం హెలికాప్టర్ లో రాంచీలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గాయపడిన మావోయిస్టు పట్ల పోలీసులు చూపిన మానవత్వం, ఔదార్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.