Encounter In Chhattisgarh (2)
Encounter In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఉసూర్-గల్గాం గ్రామాల మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవానుకి తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడించారు. గాయపడిన జవాన్ అఖిలేష్‌ను బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు. కాగా మావోల ఏరివేతలో భాగంగా పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే జార్ఖండ్ లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ ఘటనలో 203 బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్, పోలీస్ జాగిలం (కుక్క) మృతి చెందింది.