Power Crisis : కరెంటు కోతలు.. నో టెన్షన్.. 22 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలున్నాయి

బొగ్గు కొరతతో దేశంలో విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనలు నెలకొన్నాయి. పలు రాష్ట్రాలు కరెంట్‌ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద

Power Crisis

Power Crisis : బొగ్గు కొరతతో దేశంలో విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనలు నెలకొన్నాయి. పలు రాష్ట్రాలు కరెంట్‌ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్‌ సంక్షోభంపై రోజురోజుకి ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పందించారు. బొగ్గు నిల్వలపై ఆందోళన చెందవద్దని సూచించారు. డిమాండ్‌కు సరిపడా బొగ్గు సరఫరాను పెంచుతున్నామని వివరించారు. సోమవారం థర్మల్ పవర్ ప్లాంట్లకు రికార్డు స్థాయిలో బొగ్గును సరఫరా చేసినట్లు ఆయన చెప్పారు.

Lifespan: ఇది తింటే.. మీ జీవితంలో 36నిమిషాలు తగ్గిపోయినట్లే

”ప్రస్తుతం కోల్ ఇండియా దగ్గర 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిన్న థర్మల్ పవర్ ప్లాంట్లకు రికార్డు స్థాయిలో 1.95 మిలియన్ టన్నుల బొగ్గును సప్లయ్ చేశాము. ఇప్పటివరకు ఇదే అత్యధికం. వర్షాకాలం పూర్తయ్యాక సరఫరా మరింత పెరుగుతుంది” అని మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

Digestive : తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావటం లేదా?..అయితే ఇలా ప్రయత్నించి చూడండి…

అక్టోబరు 21 తర్వాత నుంచి రోజుకు 2 మిలియన్‌ టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. భారీ వర్షాలు, అంతర్జాతీయ ధరల కారణంగానే దేశంలో బొగ్గు కొరత సమస్య తలెత్తిందన్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని, బొగ్గు నిల్వలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజలు కంగారు పడాల్సిన పనిలేదన్నారు. డిమాండ్‌కు సరిపడా బొగ్గును అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.

మరోవైపు దేశంలో బొగ్గు నిల్వల పరిస్థితిపై ప్రధానమంత్రి కార్యాలయం నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ప్రహ్లాద్‌ జోషీ, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో సమావేశమై బొగ్గు కొరతపై ఆరా తీసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం రావొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలకు లోడ్‌ సర్దుబాటులో భాగంగా కరెంట్ కోతలు అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన కేంద్రం.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కేంద్రం దగ్గరున్న కేటాయించని విద్యుత్‌ను రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని సూచించింది. మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు ‘కరెంట్‌’ సాయం చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నేడు ప్రకటన విడుదల చేసింది.