Digestive : తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావటం లేదా?..అయితే ఇలా ప్రయత్నించి చూడండి…

జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుచుకునేందుకు, తిన్న ఆహారంసరిగా జీర్ణం అవడానికి కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. అజీర్ణ సమస్యకు చక్కటి పరిష్కారం అల్లం. నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. అనంతరం అల్లంలో ఉండే సారం ఆ నీటిలోకి చేరుతుంది.

Digestive : తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావటం లేదా?..అయితే ఇలా ప్రయత్నించి చూడండి…

Digestive

Digestive :  మనిషి శరీరంలో ముఖ్యమైన వ్యవస్ధ జీర్ణవ్యవస్ధ.. మనం తిన్న ఆహారాన్ని కాలేయం నుండి విడుదలయ్యే కొన్ని రసాయనాలు జీర్ణమయ్యేలా చేస్తాయి. తద్వారా మనిషి శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌, అసిడిటీ , క‌డుపు నొప్పి, అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుచుకునేందుకు, తిన్న ఆహారం సరిగా జీర్ణం అయ్యేలా జాగ్రత్తలు పాటించాలి.

ఉరుకుల పరుగుల జీవితంతో చాలా మంది వేళాపాళ లేకుండా తినటం, ఫాస్ట్ ఫుడ్ లకు అలవాటు పడటం వల్ల చాలా మందిలో జీర్ణప్రక్రియకు విఘాతం కలుగుతుంది. త్వరగా జీర్ణం కాని వాటిని తీసుకోవటం వల్ల , సరైన వ్యాయామం, కంటి నిండా నిద్ర లేకపోవటంతో జీర్ణప్రక్రియలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తిన్న ఆహారం సరిగా అరగకపోవటంతో ఇతరత్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్​ఫుడ్ లు జీర్ణవ్యవస్ధను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. తిన్నఆహారం జీర్ణం కాక… అధిక బరువు పెరగడం.. ఇలా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుచుకునేందుకు, తిన్న ఆహారంసరిగా జీర్ణం అవడానికి కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. అజీర్ణ సమస్యకు చక్కటి పరిష్కారం అల్లం. నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. అనంతరం అల్లంలో ఉండే సారం ఆ నీటిలోకి చేరుతుంది. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల తిన్న ఆహారం జీర్ణమవుతుంది. గ్యాస్‌, అసిడిటీ దూరం చేయవచ్చు.

గ్లాస్ నీటిలో కొన్ని సోంపు గింజలను వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. భోజ‌నానికి ముందు పుదీనా ర‌సం తీసుకుంటే జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది, విరేచ‌నాలు తగ్గుతాయి. కప్పు వేడి నీటిలో కొద్దిగా తులసి ఆకులను వేసి 10 నిముషాలవరకు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని గోరువెచ్చగా చల్లబరిచి దానికి కొద్దిగా తేనె కలిపి తాగాలి. ఇలా రెండు మూడు సార్లుగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

యాపిల్ పండ్ల‌లో పుష్క‌లంగా ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌య్యేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. క‌నుక నిత్యం యాపిల్ పండ్ల‌ను తిన‌డంవ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. సోంపు గింజ‌ల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణాశ‌యంలో ఆహారం క‌ద‌లిక‌ను స‌రిచేస్తుంది. దీంతో క‌డుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది.

చల్లటి పాలు కడుపులోని ఆమ్లాలను తటస్థం చేయడానికి, అజీర్ణం చికిత్సకు కూడా సహాయపడుతుంది. కొవ్వు రహిత పాలు ఒక కప్పు చొప్పున రోజులో రెండుసార్లు తాగితే అజీర్ణ సమస్యకు ఉపశమనం లభిస్తుంది. భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను బోజనం చేసిన తర్వాత ప్రతిసారి నోట్లో వేసుకుని చప్పరిస్తే అరగకుండా ఉన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. నీటిని వైద్యులు సూచించిన మోతాదులో రోజుకు 8గ్లాసులు తాగటం వల్ల జీర్ణవ్యవస్ధ బాగా పనిచేస్తుంది.