కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కి కరోనా

భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

Prakash Javadekar Tests Positive For Covid 19

Prakash Javadekar భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరిని మహమ్మారి తన గుప్పిట్లోకి లాక్కుంటోంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ‍్యూరప్ప, యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు నేతలకు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా ఈ లిస్ట్‌లో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా చేరారు.

కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ, అట‌వీ శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌కు క‌రోనా సోకింది. ఈ విషయాన్ని శుక్రవారం ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రెండు మూడు రోజుల నుంచి తనను కలిసిన వారు తప్పనిసరిగా కోవిడ్‌ టెస్ట్‌ చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. కాగా, పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో మార్చి-6,2021న జవదేకర్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే.

ఓ వైపు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న కేసులతో దవాఖానల్లో బెడ్లు సరిపోవడం లేదు. మరోవైపు భారీగా పెరుగుతున్న మరణాలతో శ్మశానాల్లోనూ స్థలం దొరకడం లేదు. వైరస్‌ కట్టడికి పలు రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్‌ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన రేపుతోంది.