Pralay Missile : షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ “ప్రళయ్”ప్రయోగం విజయవంతం

భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్‌’ని బుధవారం డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది.

Pralay Missile: భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్‌’ని బుధవారం డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 10.30 గంటలకు దీన్ని ప్రయోగించారు. ప్రళయ్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని, ప్రళయ్‌లోని సాంకేతిక వ్యవస్థల పనితీరు సంతృప్తికరంగా ఉందని డీఆర్‌డీవో తెలిపింది. ఇ

ఇది ఉపరితలం నుంచి ఉపరితలంపైన లక్ష్యాన్నిఛేదించే కొత్తతరం కిపణి అని, సాయుధ బలగాలకు ఇది మరింత శక్తినిస్తుందని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు అన్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను అభినందించారు.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి 500-1,000 కిలోల పేలోడ్ ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది.ఇది ఘన ఇంధనంతో పనిచేస్తోంది. ఇది భారతీయ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం నుండి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా రూపొందించబడింది.

కాగా, రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి డీఆర్‌డీవో వరసగా క్షిపణులు ప్రయోగాలు చేపడుతోంది. ఈ డిసెంబర్‌లోనే అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.

ALSO READ School Students Test Covid Positive : ఒకే స్కూల్ లోని 29మంది విద్యార్థులకు కరోనా

ట్రెండింగ్ వార్తలు