Prashant Kishor: బిహార్ అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో జన సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ బోల్తా పడ్డారు. దేశంలోని కొమ్ములుతిరిగిన నేతలు, పార్టీల తరఫున పనిచేసి గెలిపించిన పీకే.. తన పార్టీని గెలిపించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. 243 స్థానాల్లోనూ పోటీ చేసిన ఆయన పార్టీ ఒక్క సీటూ గెలవలేదు. 200 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది ఆయన పార్టీ.
బిహార్ రాజకీయాలను మార్చుతానన్న పీకే పార్టీ ఇవాళ ఉదయం ఫలితాల ప్రారంభ ట్రెండ్స్‌లో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత ఆ రెండు స్థానాల్లోనూ వెనకబడిపోయింది. (Prashant Kishor)
ఈ ఎన్నికల్లో జేడీయూ ఘోరంగా ఓడిపోతుందని, నితీశ్ కుమార్‌ను ఓటర్లు తిరస్కరిస్తారని కొన్ని వారాల క్రితం పీకే ఎన్నో మాటలు చెప్పారు. నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజల ముందుకు రారని జోస్యం చెప్పారు.
అయితే, జేడీయూకి 80కి పైగా స్థానాలు దక్కుతున్నాయి. జేడీయూకి ఈ ఎన్నికల్లో 25 స్థానాలు కూడా దక్కవన్న పీకే.. ఒకవేళ ఆ పార్టీ ఆ సంఖ్య దాటితే రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
తన జన సురాజ్ పార్టీ 243 స్థానాల్లోనూ పోటీ చేసిన నేపథ్యంలో, పార్టీ 150కుపైగా స్థానాలు గెలుస్తుందని లేదా 10కన్నా తక్కువకు పడిపోతుందని పీకే ఇటీవల అన్నారు.
“If JDU gets more than 25 seats, I will leave politics.”
-Prashant KishorJDU is currently leading on 75 seats, more than any other party.
😂😂😂 pic.twitter.com/lPKDCr5xfn— Sensei Kraken Zero (@YearOfTheKraken) November 14, 2025