అమరజవాన్ విషయంలో తప్పు చేశాం…క్షమాపణలు కోరిన పీకే

హందార్వా ఎన్ కౌంటర్ లో అమరుడైన జవాన్ పింటూ సింగ్ మృతదేహాం ఆదివారం(మార్చి-3,2019) పాట్నా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న సమయంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు సీఎం కానీ,ఏ ఒక్క ఎన్డీయే మంత్రి కాని,పార్టీ సీనియర్ నేత కానీ అక్కడికి రాకపోవడం తీవ్ర దుమారం రేగింది. అధికార జేడీయూ-బీజేపీ కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read : అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్

పింటూ సింగ్ మృతదేహం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న మూడు గంటల తర్వాత ఎన్నికల ర్యాలీ కోసం పాట్నా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ప్రధాని మోడీకి వెల్ కమ్ చెప్పేందుకు మాత్రం సీఎం నితీష్ కుమార్, రాష్ట్ర మంత్రులు,కేంద్రమంత్రులు అక్కడికి వెళ్లడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అమరుడైన జవాన్ కంటే మోడీ ర్యాలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ పింటూ సింగ్ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.

బీహారం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రంగంలోకి దిగారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్. పొరపాటు జరిగిపోయిందని, తన పార్టీ తరపున క్షమాపణలు చెబుతున్నట్లు ప్రశాంత్ తెలిపారు. ఆ సమయంలో ఎయిర్ పోర్ట్ కి తామెవ్వరూ రాకపోవడం తప్పేనని, అటువంటి భాధాకరమైన సమయంలో జవాను కుటుంబసభ్యులకు అండగా ఉండి, అక్కడికి వెళ్లి ఉండాల్సిందని  ట్వీట్ చేశారు.
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం

పీసీసీ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా, లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ ఎంపీ చౌద‌రి మ‌హ‌బూబ్ అలీ ఖైస‌ర్, ఎస్ఎస్పీ గ‌రిమా మాలిక్, డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ కుమార్ ర‌వి, ఇత‌ర సీఆర్పీఎఫ్ అధికారులు మాత్ర‌మే ఎయిర్ పోర్టులో  పింటూ కుమార్ సింగ్ భౌతిక‌కాయానికి  శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఆ త‌ర్వాత‌  ఆయన పార్థివ శరీరాన్ని హెలీకాప్టర్ ద్వారా ఆయన సొంతూరు బేగూసరాయ్ జిల్లాలోని బఖ్రీ గ్రామానికి తరలించారు.తమ ఊరి వీరపుత్రునికి కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు తండోపతండాలుగా బఖ్రీ గ్రామానికి వచ్చారు.

Also Read : రాజకీయం కాదా! : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు