Telangana Congress Government : త్వరలో జరగనున్న లోక్‌సభ, పంచాయతీ ఎన్నికలపై కసరత్తు

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. దేశంలో లోక్ సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ -మే నెలల్లో జరగాల్సి ఉంది. 2024వ సంవత్సరం జనవరి 2వతేదీలోగా గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగియనుంది. నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ పదవీ కాలం ముగిశాక మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి....

Election-commission

Telangana Congress Government : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. దేశంలో లోక్ సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ -మే నెలల్లో జరగాల్సి ఉంది. 2024వ సంవత్సరం జనవరి 2వతేదీలోగా గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగియనుంది. నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ పదవీ కాలం ముగిశాక మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. దీంతో 2024వ సంవత్సరంలో లోక్‌సభ, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు, ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కసరత్తు ప్రారంభించారు.

ALSO READ : Hyderabad : హైదరాబాద్ నుంచి కొరవడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం…కేబినెట్‌లో బెర్తు ఎవరికి?

లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల బృందం రానుంది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సన్నద్ధతపై అధ్యయనం చేయనున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు సార్లు సమీక్షిస్తారని తెలంగాణ అధికారులు చెప్పారు.

ALSO READ : Congress victory : కాంగ్రెస్ విజయోత్సవ వేళ డిస్కౌంటు ధరపై చికెన్ విక్రయం

తెలంగాణ రాష్ట్రంలో 2019వ సంవత్సరంలో గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగాయి. 2024 సంవత్సరంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు పంచాయతీ పోలింగ్ కోసం పోలింగ్ సిబ్బందిని నియమించేందుకు కసరత్తు చేపట్టారు. 650 మంది ఓటర్లకు రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ALSO READ : Congress six guarantees : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై అందరి చూపు

పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేలా ఈ నెలాఖరులోగా పోలింగ్ సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. దీంతోపాటు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నేతలు సమాయత్తమవుతున్నారు.

ALSO READ : Telangana Congress Government : తెలంగాణలో కీలక అధికారుల మార్పునకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు

కాంగ్రెస్ అసెంబ్లీ సమరంలో సాధించిన విజయంతో ఆ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల సమరాన్ని సమర్ధంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికలకు సమయం తక్కువ ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు