Droupadi Murmu
Droupadi Murmu : నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందిస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముందుగా బిర్సాముండా, సర్దార్ పటేల్ లకు నివాళులర్పించారు. అదేవిధంగా భారతరత్న భూపేన్ హజారికా శతజయంతి సందర్భంగా ఆయనకు ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. అనంతరం బడ్జెట్ ప్రసంగం చేశారు.
Also Read : Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
జల్ జీవన్ మిషన్ కింద తాగునీరు అందిస్తున్నామని, ధాన్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నామని అన్నారు. పవర్ హబ్‌గా భారత్ ఎదుగుతోందని చెప్పారు. దేశంలో మావోయిస్టుల ప్రభావం తగ్గిందన్నారు. దేశంలో 100 కోట్ల గ్యాస్ కేనెక్షన్లు ఇచ్చామని, 25 కోట్ల మందిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చామని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ గా దేశం రూపుదిద్దుకుంటుందని, ఆ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అవినీతిరహిత పాలన అందిస్తున్నామని, అంతరిక్ష రంగంలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఇండియా సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని అన్నారు. ఆక్వా సాగులో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్ ఉందని, దేశంలో 150కిపైగా వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైళ్ల కనెక్టివిటీ పెరిగిందని అన్నారు.
గత పదేళ్ల ఎన్టీయే పాలనలో పేదలకు 4కోట్ల పక్కా గృహాలను నిర్మించామని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి జీవిత బీమా కల్పించడం లక్ష్యం అన్నారు. 80వేల ఆయుష్మాన్ భారత్ కేంద్రాల్లో రోగులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. పదేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందినట్లు రాష్ట్రపతి తెలిపారు. 150 టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశం అగ్రస్థానంలో ఉందన్నారు. అదే విధంగా ఆక్వా, పాల ఉత్పత్తులలో దేశం ముందంజలో ఉన్నట్లు తెలిపారు.