Droupadi Murmu
Droupadi Murmu: సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంచలన ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర ప్రతి, గవర్నర్లకు కూడా సుప్రీంకోర్టు డెడ్ లైన్లు విధించగలరా అని ప్రశ్నించారు. తమిళనాడు కేసులో.. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని, బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ జత చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. తాజాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు ప్రశ్నలు సంధిస్తూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. గవర్నర్ల పై గడువులు విధించొచ్చా అని ఆ లేఖలో ద్రౌపది ముర్ము ప్రశ్నించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో 14 ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలన్నీ గవర్నర్, రాష్ట్రపతి అధికారాలకు సంబంధించినవి. అదేవిధంగా.. రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 200, 201, 361, 143, 142, 145(3), 131లకు సంబంధించినవి. బిల్లు తన వద్దకు వచ్చినప్పుడు గవర్నర్ కు ఏ ఎంపిక ఉంటుంది..? మంత్రి మండలి సలహాలను గవర్నర్ పాటించాల్సిన అవసరం ఉందా..? అని ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో ప్రశ్నించారు.
రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు ఇవే..
♦ రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి?
♦ రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలేంటి?
♦ రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు?
♦ సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?
♦ రాజ్యాంగంలోని 361వ అధికరణం, 200వ అధికరణం కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షపై పూర్తి నిషేధం విధిస్తుందా?
♦ ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?
♦ రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్టికల్ 143 కింద సుప్రీం కోర్టు సలహాను పొందడానికి లేదా గవర్నర్, రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లును రిజర్వ్ చేయడం లేదా ఇతర విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం అవసరమా?