రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

  • Publish Date - December 6, 2019 / 08:59 AM IST

రేపిస్టులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులపై దయ చూపాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని కీలక కేసుల విషయంలో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటీషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు.

దేశ వ్యాప్తంగా జరగుతున్న హత్యాచార ఘటనపై రాష్ట్రపతి మాట్లాడుతూ..బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారం..హత్య, హింసలు వంటి ఘటనల కేసుల్లో దోషులు క్షమాభిక్ష కోసం పిటీషన్లు పెట్టుకుంటున్నారనీ.. కానీ రేపిస్టులపై దయా చూపాల్సిన అవసరం లేదని అన్నారు. రాజస్థాన్ లోని ఓ మహిళా సదస్సులో రాష్ట్రపతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్భయ కేసులో ఓ నిందితుడు క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకున్నారనీ.. కానీ భయకరంగా ప్రవర్తిస్తు మహిళల జీవితాలను చిదిమేస్తున్న రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదన్న రాష్ట్రపతి వారు ఎటువంటి పరిస్థితుల్లో క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకున్నారు అనే అంశంపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు.

మహిళ భద్రత అనేది సీరియస్ అంశం అనీ..పోక్సో చట్టం కింద అత్యాచార నిందితులుగా నిర్థారించిబడినవారికి క్షమాభిక్ష పిటీషణ్ దాఖలు చేసే అర్థం లేదన్నారు. క్షమాభిక్ష అంశాన్ని పార్లమెంట్ సమీక్షించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సూచించారు. 

మహిళలపై రేప్ లకు పాల్పడుతు..హత్యలు చేస్తున్నవారికి కఠిన శిక్షలు పడాల్సిన అవసరముందనే అభిప్రాయాన్ని రాష్ట్రపతి వెల్లడించారు. కానీ క్షమాభిక్ష ఎందుకు కోరుకుంటున్నారనే అంశాన్ని పరిశీలించాలనీ..దానిపై చర్చ జరగాలని అన్నారు.