దీన్ని మధ్యాహ్నా భోజనం అంటారా : పిల్లలతో పసుపు నీళ్ల బియ్యం తాగించారు

  • Publish Date - October 15, 2019 / 01:00 PM IST

పేరుకే మధ్యాహ్నా భోజనం. కానీ, అక్కడ కూరగాయలతో అన్నం వడ్డించరు. అచ్చం పసుపు నీళ్లను జ్యూస్ లా చేసి తాగిస్తున్నారు. పసుపు నీళ్ల బియ్యాన్ని చిన్నారులతో బలవంతంగా తినిపించారు. మధ్యాహ్నా భోజనం పథకం పేరుతో స్కూల్ విద్యార్థులకు పసుపు నీళ్లను బలవంతంగా తాగించిన ఘటన యూపీలోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగింది. మధ్యాహ్నా భోజనం మెనూలో భాగంగా స్కూల్ విద్యార్థులకు కూరగాయలు, అన్నం వడ్డించడానికి బదులుగా పసుపు నీళ్లతో తయారుచేసిన ఆహారాన్ని వడ్డించారు.

రాష్ట్ర రాజధాని లక్నోకు 90 కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్ జిల్లాలో విచ్ పారియా గ్రామంలో ఈ అమానుషం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ప్రాథమిక విద్యా శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే అధికారులు ప్రాథమిక పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. అక్కడి విద్యార్థులను అడిగి మధ్యాహ్నా భోజనం మెనూకు సంబంధించి వివరాలను అధికారులు రికార్డు చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. 

ఆగస్టులో కూడా ఇలాంటి ఘటనే వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్నా భోజనంలో ముక్కలైన చపాతీలను ఉప్పుతో వడ్డించడం వివాదాస్పదమైంది. ఈ ఘటన కూడా యూపీలోని మిర్జాపూర్ లోని హినాట గ్రామంలో జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం దీనికి కారణమైన స్కూట్ టీచర్ ను సస్పెండ్ చేశారు.