Prime Minister Modi : ఈ పథకాలు సురక్షితం…పెట్టుబడి పరిధిని విస్తరిస్తాయి

రెండు పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపజేస్తాయని, పథకాలు మరింత సురక్షితమైనవిగా వెల్లడించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

RBI Retail Direct Scheme : రెండు పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపజేస్తాయని, పథకాలు మరింత సురక్షితమైనవిగా వెల్లడించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్‌లను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తాయన్నారు. రిటైల్ డైరెక్ట్ పథకంతో, దేశంలోని చిన్న పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడికి సులభమైన మరియు సురక్షితమైన మాధ్యమాన్ని పొందుతారని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీమ్, వన్ నేషన్, వన్ అంబుడ్స్ మన్ సిస్టమ్ బ్యాంకింగ్ రంగంలో రూపుదిద్దుకుందన్నారు.

Read More : AP : జగన్‌కు వైద్య పరీక్షలు, విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు

2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం… భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క వినియోగదారుల కేంద్రంగా రెండు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఇందులో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, రిజర్వ్ బ్యాంక్ – ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీమ్ లున్నాయి. ఈ స్కీమ్‌లను వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంఛ్ చేశారాయన. ఈ సందర్భంగా..ఆయన మాట్లాడుతూ..21వ శతాబ్దపు ఈ దశాబ్దం దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ (RBI) పాత్ర కూడా చాలా పెద్దదన్నారు.

Read More : Heavy Rains : చెన్నై మునిగిపోతుందా..ఏంటా వర్షాలు..ఎక్కడ చూసినా వరదే

ఆర్బీఐ బృందం దేశం యొక్క అంచనాలను అందుకోగలదని తనకు నమ్మకం ఉందన్నారు మోదీ. ఖాతాదారుడికి ఫిర్యాదుల పరిష్కారానికి సులభమైన మార్గం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు