AP : జగన్‌కు వైద్య పరీక్షలు, విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. 2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం ఆయన అమరావతిలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు.

AP : జగన్‌కు వైద్య పరీక్షలు, విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు

Jagan

AP CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. 2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం ఆయన అమరావతిలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు పలు పరీక్షలు చేశారు. ఇటీవలే ఎక్సర్ సైజ్ చేస్తుండగా..ఆయన కాలికి గాయమైంది. అప్పటి నుంచి మడమనొప్పితో బాధ పడుతున్నారు. నొప్పి ఎక్కువ కావడం, వాపు రావడంతో…డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల రిపోర్టులను చూసిన అనంతరం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ కు వైద్యులు సూచించారు.

Read More : Chennai Rains : వానలో పెళ్లి.. బోటులో వధూవరులను తీసుకెళ్లిన రెస్క్యూ టీం

మరోవైపు..భారీ వర్షాలు కురుస్తుండడంతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. జిల్లాల కలెక్టరలతో సమీక్ష నిర్వహించారు. చిత్తూరు, కడప కలెక్టర్లు, ఇతర జిల్లాల అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచే సమీక్ష చేశారు. తడ, సూళ్లూరుపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, సహాయ శిబిరాల్లో ఉన్న వారిని మంచిగా చూసుకోవాలన్నారు. వారికి మంచి ఆహారం అందించాలని, బాధితులకు వేయి రూపాయల చొప్పున అందించాలని సూచించారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని, బాధితుల కోసం ఒక ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.