సభ్యులు సహకరించండి.. సమస్యలపై చర్చిద్దాం: ప్రధాని మోడీ

  • Publish Date - November 18, 2019 / 05:13 AM IST

భారత పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం అవుతున్నాయి. సమావేశాల ప్రారంభం కంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు.

పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలు సమావేశాలకు సహకరించాలని కోరారు నరేంద్ర మోడీ. సభ్యులు సహకరిస్తే అన్ని అంశాలపై కూలంకషంగా చర్చలు జరుపుకుందామని మోడీ స్పష్టం చేశారు. 

2019లో ఇవి చివరి సమావేశాలు అని వెల్లడించిన మోడీ ఈ సమావేశాలకు ప్రత్యేకత ఉందని అన్నారు. రాజ్యసభకు ఇది 250వ సమావేశం అని తెలిపారు.

నవంబర్‌ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తామన్నారు మోడీ. భారత రాజ్యాంగం 70ఏళ్లు పూర్తి చేసుకోబోతుందని మోడీ వెల్లడించారు.