Varanasi : మోదీ టీ బ్రేక్..వారణాసిలో భారీ రోడ్ షో

ప్రధాని టూర్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. నరేంద్రమోదీ సాధారణ వ్యక్తిలా ఓ టీ స్టాల్కు వెళ్లి చాయ్ తాగారు. రోడ్‌ షో మధ్యలో ఓ టీస్టాల్కు వెళ్లి... మట్టి గ్లాసులో ఇచ్చిన చాయ్ తాగుతూ

Modi Tea

Prime Minister Narendra Modi Tea Break : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఏడో దశ పోలింగ్ కు కొద్ది రోజులు మాత్రమే ఉంది. మార్చి 07వ తేదీన జరిగే పోలింగ్ తో ఎన్నికలు ముగియనున్నాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఏడో దశ పోలింగ్ సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధానంగా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కాషాయ అగ్రనేతలు యూపీలో మకాం వేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసిలో పర్యటించారు. భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రధాని టూర్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. నరేంద్రమోదీ సాధారణ వ్యక్తిలా ఓ టీ స్టాల్కు వెళ్లి చాయ్ తాగారు. రోడ్‌ షో మధ్యలో ఓ టీస్టాల్కు వెళ్లి… మట్టి గ్లాసులో ఇచ్చిన చాయ్ తాగుతూ కాసేపు సేదదీరారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.

Read More : UP : యూపీలో మమతకు షాక్.. నల్లజెండాలతో నిరసన

మరోవైపు…తుది విడత ప్రచార ఘట్టం తారాస్థాయికి చేరింది. వారణాసిలో భారీ రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ప్రజలకు అభివాదాలు తెలుపుతూ, కార్యకర్తల నినాదాల మధ్య ప్రధాని ఎంతో ఉత్సాహంగా రోడ్‌షోలో పాల్గొన్నారు. దీనికి ముందు, వారణాసిలోని మాల్దహియా చౌక్‌లోని సర్దార్ పటేల్వి గ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రధాని రోడ్‌షో సందర్భంగా అన్ని రోడ్లు మోదీమయం అయ్యాయని, కాశీలో మోదీ పేరు మారుమోగిందని ఉత్తరప్రదేశ్ బీజేపీ యూనిట్ ట్వీట్‌ చేయడంతో పాటు రోడ్‌షో వీడియోను పోస్ట్ చేసింది. రోడ్‌ షో తర్వాత మోదీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు మోదీకి ఆశీర్వాదం అందించారు. డమరుకం వాయిస్తూ మోదీ అందరినీ ఉత్సాహపరిచారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత అదే స్థలం నుంచి తన మొదటి రోడ్ షోను మోదీ ప్రారంభించారు.

Read More : Uttar Pradesh : యూపీలో 10 రోజుల ముందుగానే హోలీ – మోదీ

అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో గెలుపు బీజేపీకి అత్యవసరం. ఓ రకంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు.. సార్వత్రిక ఎన్నికల గమనాన్ని నిర్దేశించనుంది. యూపీలో నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 404 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ 202.  2017 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీకి ప్రస్తుతం 303 స్థానాలున్నాయి. ఇదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా, యోగీ భావిస్తున్నారు. యూపీ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. యూపీ ఎన్నికలే లక్ష్యంగా ఇటీవలే ప్రధాని కాశీ కారిడార్ ప్రారంభించారు. పూర్తిగా రెండు రోజులు పర్యటించి.. యూపీని బీజేపీ ఎంత కీలకంగా భావిస్తోందో సంకేతాలిచ్చారు.

Read More : UP Election 2022: యూపీలో దళితులే కింగ్ మేకర్స్.. బీఎస్‌పీ మ్యాజిక్ చేస్తుందా? పూర్తి లెక్కలు ఇవే!

ఉత్తర్‌ప్రదేశ్ లో :-
మొత్తం స్థానాలు 404
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు 202
అధికారంలో బీజేపీ
బీజేపీకి 303 స్థానాలు
ఎస్పీకి 49 స్థానాలు
బీఎస్పీకి 15 స్థానాలు
కాంగ్రెస్‌కు 7 స్థానాలు
ఒంటరిగా పోటీచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ
మిత్రపక్షాలతో కలిసి పోటీచేస్తున్న ఎస్పీ