Uttar Pradesh : యూపీలో 10 రోజుల ముందుగానే హోలీ – మోదీ

యూపీలో పది రోజుల ముందుగానే హోలీ జరుపుకుంటారని, ఎన్నికల ఫలితాలు రాగానే హోలీ సంబురాలు మొదలవుతాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యాలను విస్మరించిన వారు...

Uttar Pradesh : యూపీలో 10 రోజుల ముందుగానే హోలీ – మోదీ

Modi

Uttar Pradesh Will Celebrate Holi : ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించే మార్చి 10 నుంచి హోలీ పండుగను జరుపుకోవడం ప్రారంభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇది బీజేపీ ఎన్నికల విజయాన్ని సూచిస్తోందని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఆయన పలు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం కాన్పూర్ లో ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. మొదటి, రెండో దశలో జరిగిన ఓటింగ్ శాతం బీజేపీ విజయం చూపిస్తోందన్నారు. మొత్తం నాలుగు విషయాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయని, రాష్ట్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం, రెండోది యోగీ జీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని..పూర్తి మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read More : Anantha Sreeram: కళావతి పాట పల్లవి కోసం 42 వెర్షన్లు రాసిన అనంత శ్రీరామ్!

యూపీ ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ఓటర్లు బీజేపీకి ఓటు వేస్తున్నారని, ఓటింగ్ శాతం ఆ ధోరణి చూపిస్తోందన్నారు. అమ్మలు, సోదరీమణులు, కుమార్తెలు స్వయంగా బీజేపీ విజయపతాకాన్ని పట్టుకున్నారని, తనను ఆశీర్వదించడానికి ముస్లిం సోదరీమణులు ఇళ్ల నుంచి నిశబ్దంగా బయటకు వస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఉత్తర్ ప్రదేశ్ ను పగలు, రాత్రి దోచుకున్నారని, ప్రజలను నేరగాళ్లకు, అల్లర్లకు గూండాలకు అప్పగించారని విమర్శించారు. యూపీ ప్రజలు 2014లో వారిని ఓడించారని, 2017లో కూడా మరోసారి పరాజయం చెందించారన్నారు.

Read More : Uttarakhand : పోలింగ్ వేళ.. కమలం గుర్తున్న కాషాయ కండువా కప్పుకున్న సీఎం దంపతులు

మొత్తంగా యూపీలో పది రోజుల ముందుగానే హోలీ జరుపుకుంటారని, ఎన్నికల ఫలితాలు రాగానే హోలీ సంబురాలు మొదలవుతాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యాలను విస్మరించిన వారు…ప్రజలకు ఏదైనా మేలు చేయగలరా అని ప్రశ్నించారు. కొత్త భాగస్వామిని తీసుకొచ్చిన ప్రతిసారి ఎన్నికల తర్వాత వారితో సంబంధాలు తెంచుకుంటారని విమర్శించారు. మిత్రపక్షాలను మార్చుకుంటూనే ఉంటే యూపీ ప్రజలకు ఎలా సేవ చేస్తారని నిలదీశారు.