Uttarakhand : పోలింగ్ వేళ.. కమలం గుర్తున్న కాషాయ కండువా కప్పుకున్న సీఎం దంపతులు

ఖిర్నీ గ్రామంలో హరేంద్ర ఓటర్లుకు మద్యం పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. అయితే..

Uttarakhand : పోలింగ్ వేళ.. కమలం గుర్తున్న కాషాయ కండువా కప్పుకున్న సీఎం దంపతులు

Uttarakhand

Uttarakhand CM Dhami : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది. వివిధ దశల వారీగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. సోమవారం ఉత్తర్ ప్రదేశ్ లోని 55 స్థానాలకు, ఉత్తరాఖండ్ లోని మొత్తం 70, గోవాలోని మొత్తం 40 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచే పలు కేంద్రాల్లో రష్ కనిపించింది. మధ్యాహ్నం 1 గంట వరకు గోవాలో 44.63 శాతం, యూపీలో 39.07 శాతం, ఉత్తరాఖండ్ లో 35.21 శాతం పోలింగ్ నమోదైంది. అయితే.. ఉత్తరాఖండ్ సీఎం వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read More : CM Jagan : రోడ్డు భద్రతా మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్‌

ఓటు వేయడానికి వచ్చిన సీఎం దంపతుల మెడలో కాషాయ కండువాలు ఉండడాన్ని తప్పుబడుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఓటు వేసిన అనంతరం సీఎం సతీమణి పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు యూపీలో రెండో విడత పోలింగ్ నిర్వహిస్తుండగా బీజేపీ అభ్యర్థి కారుపై దాడి జరగడం కలకలం రేపింది. సాంబల్ జిల్లాలోని అస్మోలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత హరేంద్ర అలియాస్ రింకు వాహనంపై నిన్న రాత్రి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

Read More : Chandra Babu: చిరంజీవి జగన్‌ని ప్రాధేయపడాలా? హోదాపై యుద్ధం ఎక్కడ? -చంద్రబాబు

ఖిర్నీ గ్రామంలో హరేంద్ర ఓటర్లుకు మద్యం పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. అయితే.. కారులో మద్యం బాటిళ్లు లభించలేదు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు హరేంద్ర వాహనంపై దాడి చేశారు. కాషాయ కండువాలు కప్పుకుని ఓటు వేయడానికి వచ్చిన సీఎం ఎలాంటి వివరణనిస్తారో చూడాలి.