CM Jagan : దాబాల్లో మద్యం బంద్.. రోడ్ సేఫ్టీ కౌన్సిల్ భేటీలో సీఎం జగన్ కీలక ఆదేశాలు

పీపీపీ పద్ధతిలో రవాణాశాఖ ద్వారా ఆటోమేటెడ్‌ ఎఫ్‌సీ టెస్టింగ్‌ ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని..

CM Jagan : దాబాల్లో మద్యం బంద్.. రోడ్ సేఫ్టీ కౌన్సిల్ భేటీలో సీఎం జగన్ కీలక ఆదేశాలు

Cm Jagan Road Safety

CM Jagan : సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో రహదారి భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు జగన్.

రోడ్‌ సేఫ్టీ పై లీడ్‌ ఏజెన్సీ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పోలీస్, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్‌, రోడ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల నుంచి నిపుణులతో లీడ్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. రోడ్‌ సేఫ్టీ ఫండ్‌ ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ ఇచ్చే నెట్ వర్క్ ఆసుపత్రుల జాబితా తయారు చేయాలని, నగదురహిత చిక్సిత అందించేలా వారిని ప్రోత్సాహించాలని చెప్పారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తీసుకొచ్చే వారికి మద్దతు ఇవ్వాలని సీఎం చెప్పారు. ఐరాడ్‌ యాప్‌ వినియోగించుకుని ప్రమాదాలపై లైవ్‌ అప్‌డేట్‌ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్.

Railways Training : పది పాసైతే చాలు.. ఉచిత శిక్షణతోపాటు రైల్వేలో ఉద్యోగం

పీపీపీ పద్ధతిలో రవాణాశాఖ ద్వారా ఆటోమేటెడ్‌ ఎఫ్‌సీ టెస్టింగ్‌ ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సహకారంతో ఒక డ్రైవింగ్‌ స్కూలు పెట్టాలని సీఎం చెప్పారు. ఈ సదుపాయాలను ఆర్టీసీ వినియోగించుకోవడంతో పాటు డ్రైవింగ్‌ శిక్షణ కోసం వినియోగించుకోవచ్చన్నారు.

కీలక నిర్ణయాలకు జగన్ గ్రీన్ సిగ్నల్..
* ట్రామాకేర్‌ సెంటర్లను కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి.
* కొత్తగా ఏర్పాటు చేసే 16 మెడికల్‌ కాలేజీల్లోనూ ట్రామాకేర్‌ సెంటర్లు పెట్టాలి.
* అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించాలి.
* ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా రీహాబిలిటేషన్‌ సెంటర్‌ను వైజాగ్‌లో పెట్టాలి.
* తిరుపతి బర్డ్‌ ఆస్పత్రుల్లో ఉన్న సెంటర్‌ను మెరుగుపరచాలి.
* రోడ్డుపై లైన్ మార్కింగ్‌ చాలా స్పష్టంగా ఉండేలా చూడాలి.

Jagananna Chedodu Scheme : రూ.10వేలు రాలేదా? మార్చి 11లోపు ఇలా చేయండి…

* బైక్‌లకు, ఫోర్‌ వీల్‌ వాహనాలకు ప్రత్యేకంగా లైన్స్ ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలి.
* రోడ్లపై ఎంత వేగంగా వెళ్లాలో సూచిస్తూ సైన్‌ బోర్డులు తప్పక పెట్టాలి. ఫలితంగా చాలావరకు ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉందన్న సీఎం.
* రోడ్లు పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా కఠినంగా వ్యవహరించాలి. దీని వల్ల చాలావరకు ప్రమాదాలు తగ్గుతాయి.
* ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్‌ బారియర్స్‌ ఉండాలి.
* డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలి.
* క్రమం తప్పకుండా రివ్యూ చేసుకుని రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేయాలి.
* జిల్లాల వారీగా ఏర్పాటవుతున్న కమిటీలు కూడా రోడ్డు ప్రమాదాలపై సమీక్ష చేయాలి.
* వారు తీసుకుంటున్న చర్యలను కూడా సమీక్ష చేయాలి.