Jagananna Chedodu Scheme : రూ.10వేలు రాలేదా? మార్చి 11లోపు ఇలా చేయండి…

జగనన్న చేదోడు పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో ఫిబ్రవరి 8న రూ.10వేలు జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అర్హులుగా ఉండి ఈ పథకం డబ్బులు అందని వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Jagananna Chedodu Scheme : రూ.10వేలు రాలేదా? మార్చి 11లోపు ఇలా చేయండి…

Ysr Jagananna Chedodu

Jagananna Chedodu Scheme : జగనన్న చేదోడు పథకం కింద ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 8న లబ్దిదారులైన నాయీబ్రాహ్మణులు, దర్జీలు, రజకుల ఖాతాల్లో రూ.10వేలు జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అర్హులుగా ఉండి ఈ పథకం డబ్బులు అందని వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అలాంటి వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ తెలిపింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, పథకం లబ్ది మిస్ అయిన వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో మార్చి 11లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Drinking Water : పరగడుపున నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు

జగన్ సర్కార్ వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు పథకం అమలు చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదును జమ చేసింది. మొత్తం 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రెండో విడతలో రూ.285 కోట్లను విడుదల చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదు బదిలీ చేశారు జగన్.

ప్రతి ఏటా షాపులున్న ప్రతి ఒక్కరికి జగనన్న చేదోడు కింద రూ.10వేల ఆర్ధిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ఈసారి షాపులున్న 1.46 లక్షల మంది టైలర్లకు రూ.146 కోట్లు, షాపులున్న 98వేల మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. వరుసగా రెండేళ్లు కలిపి ఇప్పటి వరకూ జగనన్న చేదోడు కింద రూ.583 కోట్లు విడుదల చేశారు.

Vivo New Smartphone: వివో నుంచి T1 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

21 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ పథకానికి అర్హులు. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు అవసరమైన చేతి పనిముట్లు, వారికి పెట్టుబడి కోసం ఈ సాయం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించారు.