జైలు నుంచి విడుదలైన ఓ యువకుడు గేటు వెలుపల డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ కార్యకర్త కేపీ పాఠక్ షేర్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన శివ ఓ కేసులో తొమ్మిది నెలల జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు కన్నౌజ్‌లోని చిబ్రామౌలో నివాసం ఉంటాడు. ఓ దాడి కేసులో అతనికి గతంలో కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.1,000 జరిమానాను విధించింది.
అతడికి కుటుంబ సభ్యులు బెయిల్ ఇప్పటించకపోవడంతో అతనికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఓ ఎన్జీవో ముందుకొచ్చింది. జైలులోనే శివ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. భవిష్యత్తులో ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడబోనని కూడా చెప్పాడు.
దీంతో అతడికి బెయిల్ దక్కినట్లు తెలుస్తోంది. నెటిజన్లు శివ తన డ్యాన్స్ స్కిల్స్‌ను మెచ్చుకుంటున్నారు. అతను తిరిగి స్వేచ్ఛను పొందాడని అంటున్నారు. ఇకనైనా ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలని సూచిస్తున్నారు.
जेल से छूटने की ख़ुशी समझिए. जनाब 9 महीने से जेल में बंद थे. आज ये जेल से निकले हैं. ख़ुशी के मारे नाच रहे हैं. यूपी के कन्नौज के ये विचित्र प्राणी हैं. कहीं यह नाभी वाला पत्रकार तो नहीं. @JaikyYadav16 ☺ pic.twitter.com/TeMa7ILh5x
— kp Pathak (@KpPatha19731260) November 27, 2024
Israel Hezbollah Ceasefire : లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం వెనక ఇజ్రాయెల్ భారీ స్కెచ్ ఉందా?