అక్క వచ్చేసింది : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 07:30 AM IST
అక్క వచ్చేసింది : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ

Updated On : January 23, 2019 / 7:30 AM IST

కాంగ్రెస్ పార్టీలో బిగ్ డెవలప్ మెంట్. ఇన్నాళ్లు తల్లి, అన్నయ్యకు చేదోడువాదోడుగా ఉంటున్న ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసింది. మొదటిసారి పార్టీ పదవికి ఎంపిక అయ్యారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంతానికి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది AICC (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ). ఈ మేరకు జ్యోతిరాదిత్య సింధియా ప్రకటన విడుదల చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల క్రమంలో.. ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది.

 

2019 ఫిబ్రవరి మొదటి వారంలో బాధ్యతలు తీసుకోనున్నారు.ఇప్పటి వరకు తల్లి సోనియా, అన్నయ్య రాహుల్ గాంధీ నియోజకవర్గాలు అయిన రాయబరేలి, అమేధి లోక్ సభ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధిని మాత్రమే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా రాబోతున్నారు. 

2019 ఎన్నికలకు సిద్ధమైన ప్రియాంక :
రాబోయే లోక్ సభ ఎన్నికలకు ప్రియాంక గాంధీని సిద్ధం చేస్తోంది పార్టీ. సోనియాగాంధీ అనారోగ్యంగా పార్టీ విధుల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి రాహుల్ ఒక్కరే పార్టీని నడిపిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ కు సపోర్ట్ గా ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను చూసుకోనున్నారు ప్రియాంక. కాంగ్రెస్ పార్టీలో ఇది బిగ్ డెవలప్ మెంట్. ప్రియాంకగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటంపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్క వచ్చేసింది.. మా పార్టీ బలం పెరిగింది.. ప్రియాంక చరిష్మాతో వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తాం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.